శరీరం లో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంది
శరీరం లో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంది
ఎండలు మండిపోతున్నాయి. దానికి తోడు శరీరం లో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంది. ఇలాంటి టైం లో నీటిని తాగే విషయం లో చాలా జాగ్రత్త లు తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని NHC హెచ్చరిస్తుంది.
ఎండాకాలంలో నీటిని తీసుకునే విధానం లో తప్పులు చేయడం వలనే అనారోగ్య సమస్య లు వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే, ఎండలో నుండి ఇంట్లోకి రాగానే 10-15 నిముషాల పాటు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఆతరవాత నే నీటిని తాగాలి. లేకపోతే శరీరంలో మార్పులు జరిగి, జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిపోతుంది. పొత్తి కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చూచిస్తున్నారు.
చాలా మంది తెలియక ఎండలో నుండి బయటికి వచ్చిన వెంటనే ఐస్ నీరు తాగుతుంటారు. దాని వలన శరీర ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా హెచ్చుతగ్గులు వచ్చి గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, ఇంకా నీరసంగా అనిపించడం, తల తిరగడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, ఒక్కసారిగా చల్లటి నీరు తాగడం ద్వారా రక్త ప్రసరణపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో రాసిన సమాచారం కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా కాదు. నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ని లేదా సంబంధిత నిపుణులను అడిగి సలహా తీసుకోండి.
krupadevi chintha, Sr. content producer
Comments 0