ఈ ఆహరంలో ఇవి లేకుండా తింటే ఏమి లాభం ? ICMR
ఈ ఆహరంలో ఇవి లేకుండా తింటే ఏమి లాభం ? ICMR
ఆరోగ్యం అంటే ఏమిటి? ఎలాంటి ఆహరం తీసుకుంటే మనం ఆరోగ్యం గా ఉంటాము. కడుపు నిండా తింటేనే ఆరోగ్యమా? మనం తీసుకుంటున్న ఆహరంలో పోషకాలు ఉంటున్నాయా? చాలా తక్కువనే చెప్పాలి. ఈ విషయాన్నే మనకు గురుతుచేస్తుంది. ICMR.
(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మనం తినే ఆహారపు అలవాట్లలో ఉన్న లోపాలని బయటపెట్టింది. మన ప్లేట్ లో ధాన్యాలతో(కార్బోహైడ్రేట్లు)చేసిన ఆహార పదార్థాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, మన శరీరానికి అత్యంత అవసరమైన ప్రొటీన్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, పాలు మాత్రం కనిపించకుండా పోతున్నాయని ICMR రిపోర్ట్ స్పష్టం చేసింది.
దీని నివేదిక ప్రకారం, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి నెలకు సుమారు 7.5 కిలోల ధాన్యం సరిపోతుంది. కానీ చాలా రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఏకంగా 10 నుంచి 11 కిలోల వరకు ఉంటుందని తెలిపింది. అంతేకాదు రోజు రోజుకి ప్రొటీన్ శాతం పడిపోతుందని, ప్రతి వ్యక్తి నెలకు 12 కిలోల కూరగాయలు తినాలి. కానీ 6కేజీ ల కంటే తక్కువగా తింటున్నారని తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో రాసిన సమాచారం కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా కాదు. నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ని లేదా సంబంధిత నిపుణులను అడిగి సలహా తీసుకోండి.
krupadevi chintha, Sr. content producer
Comments 0