ఫిట్స్ వచ్చిన వెంటనే తీసుకోవలిసిన జాగ్రత్త లు ఏమిటో తెలుసా?
ఫిట్స్ వచ్చిన వెంటనే తీసుకోవలిసిన జాగ్రత్త లు ఏమిటో తెలుసా?
ఆరోగ్యంగా ఉండడం అంటే అందరికి ఇష్టమే, కానీ బిజీ లైఫ్ లో మనకు తెలియకుండానే అనారోగ్య సమస్య లు పలకరిస్తూనే ఉంటాయి. వాటిని చూసి బయపడాలిసిన అవసరం లేదు. కానీ, సరైన టైం లో, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, మన కళ్ల ముందు ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు మన చుట్టూ ఉండే వారు వారికి తెలిసిన టిప్స్ చెపుతూ ఉంటారు. వాటిలో కొన్ని మంచిగానే పనిచేస్తాయి..కానీ కొన్ని సలహాల వలన ప్రాణానికే ముప్పు వస్తుంది. చాలా మందిలో
ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఇది వచ్చిన వ్యకి కింద పడిపోతే, కంగారులో
రకరకాలుగా సొంత వైద్యం చేస్తుంటారు. చేతిలో ఇనుప తాళం చెవులు పెట్టడం, లేదా ఏదైనా ఇనుప వస్తువును పెట్టడం చేస్తుంటారు. ఇలా చేస్తే మూర్ఛ తగ్గిపోతుందని చెపుతూ ఉంటారు. అది వారి నమ్మకం, అపోహ మాత్రమే. చేతిలో తాళాలు పెట్టడం వల్ల మూర్ఛ వ్యాధి ఏమాత్రం తగ్గిపోదని, ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
అదేవిధంగా ఫిట్స్ వచ్చినప్పుడు వ్యక్తి శరీరంలో తీవ్రమైన కుదుపులు వస్తాయి. కాబట్టి వారికి గాయాలు కాకుండా ఉండాలంటే వారి చుట్టుపక్కల ఏవైనా పదునైన వస్తువులు, రాళ్లు, గాజు పెంకులు, ఫర్నిచర్ వంటి వాటికి వారిని దూరంగా ఉంచాలి.
ఇంకా, ఫిట్స్ వచ్చిన వ్యక్తి నోట్లో నీళ్లు పోయడం, వారికి టాబ్లెట్స్ వేయడం, చెంచా లాంటి వస్తువులు పెట్టడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఆలా చేయడం వలన వారి పళ్లు విరిగిపోవడం లేదా శ్వాసనాళం బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ప్రాణాపాయం కూడా కలగవచ్చు. వారి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకుని కుదుపులను ఆపే ప్రయత్నం కూడా చేయకండి. దీనివలన వారి ఎముకలు చిట్లే ప్రమాదం ఉంది.
పిట్స్ వచ్చి కిందపడిపోయిన వ్యక్తి ని వెంటనే ఎడమ వైపునకు తిప్పి పడుకోబెట్టాలి (దీనినే రికవరీ పొజిషన్ అంటారు). ఇలా చేయడం వలన వారి నోటి నుండి వచ్చే లాలాజలం సులభంగా బయటకు వెళ్లిపోతుంది. లేకపోతే అది శ్వాసనాళంలోకి వెళ్లి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో రాసిన సమాచారం కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా కాదు. నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ని లేదా సంబంధిత నిపుణులను అడిగి సలహా తీసుకోండి.
krupadevi chintha Sr. Content producer
Comments 0