సోంపు 'టీ' తో ఇ న్ని లాభాలా?
సోంపు 'టీ' తో ఇ న్ని లాభాలా?
మహిళలు నెలసరి నొప్పులను మాయం చేసే అద్భుతమైన ఔషధం. నెలసరి (పీరియడ్స్) టైం లో ఎన్నో శారీరకమైన, మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కడుపు నొప్పి (క్రాంప్స్), గ్యాస్, పొట్ట ఉబ్బరం, కడుపు బరువుగా అనిపించడం లాంటి సాధారణమైన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇంకా ఎమోషనల్ గా కూడా చాలా సెన్సిటివ్ గా మారిపోతారు. ఇలాంటి, సమయం లో ఆ బాధ, నొప్పి నుండి బయటపడడానికి పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు. కానీ అవి ఆరోగ్యనికి అంత మంచిది కాదని, వాటికీ బదులు వంటగదిలోనే ఉండే అద్భుతమైన ఔషధం సోంపును ఉపయోగించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సోంపుతో చేసిన వేడి వేడి టీ తాగడం ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఈ సోంపు రుచికరంగా ఉండటమే కాకుండా కడుపుకు ఎంతో హాయినిస్తుంది. దానితో పాటు
శరీరాన్ని కూడా తేలికపరుస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరానికి సోంపు ఎంతో బాగా పనిచేస్తుంది. ఎందుకంటే,
సోంపు గింజలు సహజ సిద్ధమైన జీర్ణ సహాయకారిగా పనిచేస్తాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో పొట్ట ఉబ్బరం, గ్యాస్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో ఇవి సహాయ పడతాయి. సోంపులో ఉన్న ఔషధ గుణాలు కడుపులోని కండరాలను శాంతపరిచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాబట్టే ఈ 'టీ' తాగిన కొద్దిసేపటికే కడుపునొప్పి తగ్గి, పొట్ట తేలికగా మారిన అనుభూతి కలుగుతుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్రకారం.. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, నొప్పిని నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి శరీరంలో ఏర్పడే వాపును తగ్గించి, నెలసరి సమయంలో శరీరంలో నీరు చేరకుండా
కాపాడుతుంది.
krupadevi chintha
Sr. Content producer
Comments 0