పిల్లల్లో హైపర్యాక్టివ్నెస్ ఎక్కువ అయితే, ఏమి చేస్తారో తెలుసా?
పిల్లల్లో హైపర్యాక్టివ్నెస్ ఎక్కువ అయితే, ఏమి చేస్తారో తెలుసా?
మీ పిల్లలు అతిగా మాట్లాడటం గమనిస్తున్నారా? మీ పిల్లల వయసు కు తగ్గట్టుగా మాట్లాడం లేదా? పరిమితికి మించి మాట్లాడుతున్నారా? 5 ఇయర్స్ దాటినా పిల్లలు అయితే, ఇంట్లో ఎవరైనా మాట్లాడుతుంటే మాటలను మధ్యలో అడ్డుకునేందుకు ట్రై చేస్తున్నారా? అయితే, మీ పిల్లలకు అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ ఉన్నట్టే.
ఇలాంటి పిల్లలకి ఏకాగ్రత లోపం ఉంటుందని, అతి చురుగ్గా ఉండే పిల్లలు ఏకాగ్రతగా పని చేయడంలో ఇబ్బంది పడతారని నిపుణులు చెబుతున్నారు.
వీరు చదువు లేదా ఇతర పనులపై దృష్టిని సారించలేకపోతుంటారు. త్వరగా విసుగును చూపిస్తారు.అంతేకాదు ఎవరైనా చెప్పిన విషయాలను వెంటనే మర్చిపోవడం, బొమ్మలు, పుస్తకాలను లేదా వస్తువులన పోగొట్టుకోవడం వంటివి చేస్తుంటారు. వీటితో పాటు
పిల్లల అతి చురుకుదనంలో ఫోన్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే, వారి ప్రవర్తన ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాంటి పిల్లలకి ఒక టైం టేబుల్ ను అలవాటు చేయాలి. వారిలో ఫిజికల్ ఆక్టివిటీస్ ని పెంచాలి. ప్లే గ్రౌండ్స్ లో ఎక్కువగా ఆదుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే వారు క్రమంగా అల్లరిని తగ్గించడం మొదలు పెడతారు.
Krupadevi chintha
Sr, content producer
Comments 0